• America Illali Muchchatlu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరికా ఇల్లాలి ముచ్చట్లు

    America Illali Muchchatlu

    Pages: 138
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 5 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 premium votes.
Description

పురాణం సుబ్రమణ్యశర్మగారి ''ఇల్లాలి ముచ్చట్లు'' అమెరికాలో చదివి ఆనందించిన నేను సాహసించి చేసిన చిన్ని ప్రయత్నమే ''అమెరికా ఇల్లాలి ముచ్చట్లు''.

సాంప్రదాయబద్థంగా, ఆకుచాటు పిందెలా పెరిగి, పెళ్ళి పేరుతో తమ సంస్కృతీ-సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ఎంతో భిన్నమైన వాతావరణంలోకి వచ్చిన ఆడవారి మనోభావాలే ఈ ''అమెరికా ఇల్లాలి ముచ్చట్లు''.

19 ఏళ్ళ వయసులో 1976 లో మధ్యతరగతి కుటుంబం నుంచి మధ్యతరగతి చదువుతో, మధ్యతరగతి ఆలోచనలతో భయం భయంగా అడుగు పెట్టిన నా అమెరికా జీవిత అనుభవాలకు, నా చుట్టూ వున్న, నా కంటే ఎంతో ముందు వచ్చిన ఎందరో ఇల్లాళ్ళ మనోభావాలను జతచేసి రాసినవే ఈ ముచ్చట్లన్నీను.

- శ్యామల దశిక

* * *

You can take a girl out of India but you can not take India out of the girl అన్నమాట అక్షరాలా నిజం చేసిన పుస్తకం 'అమెరికా ఇల్లాలి ముచ్చట్లు'. ఈ పుస్తకంలో 21 ముచ్చట్లు, ఒక డజను పైగా కథలు కలసి ఆంధ్ర రాష్ట్రంలో పెంచి, అమెరికాలో తీసిన చెరుకు రసం!

శ్యామల భాషలో తెలుగుతనం, చెప్పినతీరు, ఎన్నుకున్న పాత్రల నైపుణ్యత ఎంతో సున్నితంగా, కోమలంగా వున్నాయి. కబుర్లన్నీ భార్యా, భర్తల సంభాషణలే అయినా ఎక్కడ భర్తగారి స్వభావమే గాని, స్వరూపం కనుపించదు.

నాజూగ్గా భర్తను మందలిస్తూనే మగమహారాజుల మీద చురుగ్గా మంచి బాణాలను వదిలారు. భర్త భావాలను గౌరవిస్తూనే తన స్వతంత్రం, స్వేఛ్చ ఎలా పెంచుకోవచ్చో చక్కగా చూపించారు.

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు అనగానే ఏవేవో అమ్మలక్కల కబుర్లు అనుకుని చదవకపోతే మాత్రం చాలా చక్కని అనుభవాన్ని కోల్పోతారు జాగ్రత్త!

- రమాదేవి చెరుకూరి

Preview download free pdf of this Telugu book is available at America Illali Muchchatlu
Comment(s) ...

Nice Book. I recommend this book to who stayed in USA more than 2 years.