• Amaravati
  • Ebook Hide Help
    ₹ 899.10
    999
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమరావతి

    Amaravati

    Pages: 181
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నవ్యాంధ్ర దర్శిని... అమరావతి అన్న ఈ పుస్తకం ఆద్యంతం మనోహరంగా, ఉపయుక్తంగా తయారు చేయబడినది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు, వరుస క్రమంలో, దర్శనీయమైన అనేక ప్రదేశాల వివరాలను బహువర్ణ చిత్రాలతో కలిపి ముద్రించడం జరిగింది.
గోదావరి నదికి జరుగుచున్న మహా పుష్కరాలను దృష్టిలో నుంచుకొని, యాత్రికులకు అవసరమైన సమాచారాన్ని పొందుపరచారు.
రాష్ట్ర పర్యాటక రంగాభివృద్ధికీ, యాత్రికులకు కావలసిన సమాచారాన్ని అందించడానికీ, ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తమనడంలో ఏ సందేహమూ లేదు.

- చాగంటి కోటేశ్వర శర్మ

ఈ వేళ ప్రపంచీకరణ విషవలయంలో పరిభ్రమిస్తున్న ఇంటితెరా, వెండితెరా నా సంస్కృతీ సంప్రదాయాలకు సమాధి కట్టేస్తున్నాయి.
అంతర్జాలంలో బందీలుగా చిక్కుకుని మనుషులు విశాలమైన బయటి ప్రపంచం చూడలేని కబోదులవుతున్నాడు. ఇలాంటి కలుషిత వాతావరణంలో శివన్నారాయణరెడ్డి గారు నవ్యాంధ్రప్రదేశ్‌లోని అధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక విశేషాలతో కూడిన ‘అమరావతి’ గ్రంథాన్ని గోదావరి పుష్కరాల ప్రత్యేక సంచికగా మన ముందు ఆవిష్కరిస్తున్నారు.

- ముద్దాడ రవిచంద్ర

శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని చిటికెనవ్రేలితో ఎత్తి పట్టుకున్నట్టు శివన్నారాయణరెడ్డి ‘అమరావతి’ పేరుతో గోదావరి పుష్కరాల ప్రత్యేక సంచిక వెలువరించే బాధ్యతను భుజాల మీదకు ఎత్తుకున్నాడు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అతని నేర్పు’యాత్ర’, ‘గోదావరి’ పుస్తకాల రూపంలో ఎప్పుడో తేటతెల్లమైంది. పని రాక్షసుడైన మిత్రుడు శివన్నారాయణరెడ్డి మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నవ్యాంధ్రలోని పదమూడు జిల్లాల అనంత సౌందర్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నాడు. ఆ రంగుల హరివిల్లులోని అందాలను ఆస్వాదించేందుకు... పదండి ముందుకు!

- అదృష్టదీపక్

గమనిక: " అమరావతి" ఈబుక్ సైజు 17.7 mb
Preview download free pdf of this Telugu book is available at Amaravati