• Aliveni Animutyama
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అలివేణి ఆణిముత్యమా

    Aliveni Animutyama

    Pages: 158
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీ చేతుల్లో ఉన్న ఈ "అలివేణీ ఆణిముత్యమా" నాకెంతో ఆనందాన్నిచ్చింది. అప్పుడే పేగు తెంచుకున్న పసికందును చూసుకుని పచ్చిబాలింత సంబరపడ్డట్టుంది ఇప్పటి నా స్థితి. అమ్మలేని, ఆడపిల్లలేని, మహిళల ప్రమేయంలేని లోకం అసలు లోకమే కాదు. ఎందరో ఆడకూతుళ్ళు ఈ సమాజం కోసం, దీని క్షేమం కోసం నేల నలుచెరగులా పాటుపడుతున్నారు. ఎన్నెన్నో పాట్లు పడుతున్నారు. వీళ్ళంతా సామాన్యులే, కానీ అసమానమైన సేవలు చేస్తున్నారు.

రెండుకాళ్ళూ పోలియో మింగేసినా బెంగపడకుండా తోటివారి ఉన్నతికి తపిస్తున్న సత్యమ్మ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. సైకిల్ రిపేర్లు చేస్తూ తల్లిదండ్రులకు కొడుకులేని లోటు తీరుస్తున్న చిన్నారి అగుపడుతుంది. తాగుడుకు జనాన్ని దూరం చేసే ఆలోచనతో శ్రమపడుతున్న ఉమమ్మ దర్శనమిస్తుంది.

వీళ్ళంతా రేపటి యుగానికి సారధులు. వీరి జీవితాలు పదుగురికీ ప్రేరణనిస్తాయి. అందుకే ఇలాంటి మహామహిళలను గురించి సాక్షి ఫ్యామిలీలో నేను రాసిన కొన్ని ఫీచర్లను అతికి అట్టకట్టించేను. సజ్జనుల జీవితాన్ని చదివినా, విన్నా నవోదయమే. అందుకే ఈ పుస్తకం మీ చేతికి చేరింది.

చదవండి. ఆశీర్వదించండి. అందరికీ వందనాలు.

- డా. చింతకింది శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Aliveni Animutyama