-
-
అలల వాన
Alala Vaana
Author: Inampudi Srilaxmi
Language: Telugu
Description
నువ్వు పరశురాముడివై తలనరికినాడు
తండ్రికి తగ్గ తనయుడవని తలొంచాను
రాముడిగా నువ్వు
నిండు చూలాలిగా ఉన్న నన్ను
అరణ్యాల పాలు చేసినప్పుడు
రాజుగా ప్రవర్తించావని మెచ్చుకున్నాను
హరిశ్చంద్రుడిలా యిచ్చిన మాట కోసం
ఆలినే అమ్ముకున్నప్పుడు
సత్యసంధుడవని సంబరపడ్డాను
ధర్మరాజుగా జూదంలో ఫణంగా పెట్టి ఓడినప్పుడు
కష్టాల్లో పాలుపంచుకున్నానని ఆనందించాను.
కృష్ణుడిగా పదహారువేలమంది భార్యల్ని భరించిననాడు
భర్తవి కదా అని సరిపెట్టుకున్నాను
అన్ని కాలాల్లోను
నిన్ను నేను నమ్ముకుని వరించానే కానీ యెదిరించలేదు
ఇప్పుడు మాత్రం
అమ్మకాని కున్న నిన్ను వెలకట్టి కొనుక్కోలేను
ఇక నిన్నెవ్వరూ కొనుక్కోకుండా చూడడమే నా పని!
Preview download free pdf of this Telugu book is available at Alala Vaana
Login to add a comment
Subscribe to latest comments
