• Akshara Sourabhalu
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్షర సౌరభాలు

    Akshara Sourabhalu

    Pages: 18
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారు వ్రాసిన ఏకవాక్య కవితల సంపుటి "అక్షర సౌరభాలు" - ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్,
"వాక్యం రసాత్మకం కావ్యం" అని 14వ శతాబ్దంలోని అలంకారికులైన విశ్వనాథ వారు. రసగంగాధరంలో జగన్నాథ పండిత రాయలవారు "రమణీయార్థ ప్రతిపాదక శబ్ధః కావ్యం" అన్నారన్నది జగద్విదితమే. కొన్ని దశాబ్దాల క్రితమే (సుమారుగా 90 ఏళ్ల క్రితం) విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ఈ ఏకవాక్యకవితలకు అంకురార్పణ చేసారు . ఆ ప్రక్రియను పుణికిపుచ్చుకొని ఆచార్య డాక్టర్ ఫణీంద్రగారు తెలుగులో ఏకవాక్య కవిత్వానికి ఆద్యులైనారు. ఆయన చూపిన దారిలో ఎందరో ఏకలవ్య శిష్యులు ఏకవాక్య కవిత్వానికి పట్టాభిషేకం చేసారు. చేస్తున్నారు . ఇప్పటికి కొన్ని ఏకవాక్యకవితల సంపుటులు ముద్రితమై ఈ ప్రక్రియకు శ్రీగంధాన్ని అద్ది తెలుగు సాహితీవనంలో పరిమళించేలా చేసాయి
అదే బాటలో నడుస్తున్న సత్కవి మిత్రులు శ్రీ సబ్బని లక్ష్మీనారాయణగారు
ఆయన వ్రాసిన మరో ఏకవాక్య కవితల సంపుటిని "అక్షర సౌరభాలు" గా రసాత్మకమైన భావత్మకమైన శతాధిక వాక్యాలను తెలుగు కవిత్వచరణాలకు అర్పించారు.
అర్పించిన ప్రతీసుమంలోనూ శబ్దసౌందర్యం భావ సౌందర్యం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇందులో ప్రతీ భావంలోనూ ఒక లఘుకావ్యాన్ని పొందుపరిచినట్లుగా కనిపిస్తుంది చదువరికి. కవి చెప్పినట్లుగా "ఒక చిన్న వాక్యం చాలు... నిన్ను కదిలించేందుకు" కవిత్వానికి ముగింపుగా వ్రాసే ఒక్క వాక్యం కవిత్వసారాన్ని మనకు అందించేస్తుంది. మనం స్పందించేలా చేస్తుంది
కలం పట్టిన కవినీ... ఉదయించే రవినీ ఆపేవారు నిజంగానే లేరనేది ఎంత సత్యమో కదా. కన్నీటితో కడిగినా పోనిదే కష్టాల్ని నింపుకున్న జీవితం... నిజంగా అద్భుతమైన భావం. జీవితాన్ని కాచివడబోసిన వారికే సాధ్యమేమో ఇలాంటి వాక్యాల్ని కవిత్వంలో చొప్పించడం. అదృష్టమంటే విజయానికి చివరిమెట్టు అంటూ వాస్తవానికి అద్దంపట్టే వాక్యం చెప్పారు కవి. జ్ఞానసముద్రాన్ని చిలికినట్లుగా అనిపిస్తుంది ఇందులోని ఆణిముత్యాలను చూస్తుంటే. హార్దిక సంబంధాలను ఆర్ధిక సంబంధాలుగా చెప్పడం ఈరోజు సమాజంలోని పరిస్థితిని, సంబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపడమే.
సాహిత్యాన్నే శ్వాసిస్తూ సాహిత్యాన్నే ప్రేమిస్తూ తెలుగుభాషకు అక్షరసుమార్చన చేస్తున్న సత్కవి మిత్రులు శ్రీ సబ్బని లక్ష్మీనారాయణగారికి శుభాభినందనలు....

- గజల్ శిరోమణి,
సంస్కృతీ భూషణ్,
ఏకవాక్య కవితావిశారద,
ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

Preview download free pdf of this Telugu book is available at Akshara Sourabhalu