• Akkineni Chitrallo Sukthulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్కినేని చిత్రాల్లో సూక్తులు

    Akkineni Chitrallo Sukthulu

    Author:

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


... పెద్దల మాట ఎప్పుడూ చద్దిమూటే! ఆ చద్ది అన్నానికి తాళింపు వేసి, పింగాణీ పళ్ళెపు హంగులతో అందిస్తే కొత్త తరానికీ హత్తుకుంటుంది. సినిమా మాధ్యమం కలిగించే బలీయమైన ప్రభావం తెలిసి దాన్ని సమాజశ్రేయస్సుకు ఉపయోగించదలచిన మహనీయులెందరో యీ సత్యాన్ని గుర్తించి సూక్తులను సూక్తులుగా కాక చిత్రగీతాలుగా మలచి శ్రవణపేయంగా, కమనీయంగా అందించారు. మళ్ళీ మళ్ళీ నెమరువేసుకునే లయబద్ధమైన పదాలతో, శ్రవణపుటాలలో నిలిచిపోయే బాణీలతో, కనురెప్పలలో కాపురముండిపోయే చిత్రీకరణతో చేరడంతో అవి మనసు మేల్కొపుతాయి, ప్రబోధిస్తాయి, హెచ్చరిస్తాయి, దారి చూపుతాయి, ఓదారుస్తాయి, లోకరీతి వివరిస్తాయి.


ఈ కృషిలో గీతకారులు, సంగీతకారులు, ఛాయాగ్రాహకులు, దర్శకులు ఎందరు పాలుపంచుకున్నా ఈ హితబోధ కథానాయకుని పరంగానే ప్రేక్షకులలో నాటుకుంటున్నది విస్మరించలేని వాస్తవం.


"మనసున మనసై..."
"నీతికి నిలబడి నిజాయితీగా పదరా..."
గాంధి పుట్టిన దేశమా యిది.."
"కారులో షికారు కెళ్ళే..."
"ఎదగడాని కెందుకురా తొందరా.."
"కల కానిది, విలువైనది.."
"నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ..."
"బడిలో ఏముంది...?"
"బ్రతుకు పూలబాట కాదు..."
"విద్యార్థులు నవసమాజా నిర్మాతలురా..."
ఇటువంటి పాటలు నటసామ్రాట్ నటించి ఉండకపోతే ప్రేక్షకుల హృదయాలను తాకేవా? తాకినా అక్కడ నాటుకునేవా? అందుకనే "పద్మవిభూషణ్" అక్కినేని నాగేశ్వరరావుగారి 88వ జన్మదిన సందర్భంగా వెలువడిన యీ పుస్తకానికి మకుటం "అక్కినేని చిత్రాల్లో సూక్తులు".

Preview download free pdf of this Telugu book is available at Akkineni Chitrallo Sukthulu