• Akhilasa - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అఖిలాశ (free)

    Akhilasa - free

    Publisher: J.V.Publishers

    Pages: 111
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిన్నవయసులోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోటానికి ఎంతో కృషి చేసి సాహిత్య వినీలాకాశంలో ధృవతారగా మెరుస్తున్న చిన్నవాడు, అమ్మా అని ఆప్యాయంగా పిలిచే పసివాడు జాని బాషా చరణ్. తన కలానికి పదును పెట్టి సమకాలీన అంశాలపై అతడు రాసిన కవితలెన్నో నేటి సమాజ పరిస్థితులకు అద్దం పడతాయి. ప్రేమ, విరహం, వేదన.. ఒకటేమిటి తన కవితలలో అతడు సృజించని అంశం లేదంటే అతిశయోక్తి కాదేమో! అమ్మ గురించి రాసిన కవిత అందరి హృదయాలను కదిలిస్తుంది. అతనికున్న విషయ పరిజ్ఞానం ప్రశంసనీయమైనది. ఇలాంటి మరెన్నో రచనలు చూస్తూ అందరినీ అలరిస్తూ సాహిత్య ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని అందరి మనస్సులో సాహితీ ముదుబిడ్డగా నిలిచిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.

- హంసగీతి
గజల్ కవయిత్రి

*****

సాహితీ తరంగిణిలో ఎగిసిపడే అలల తరంగాల్లోని ఓ అల మా తక్కెడశిల. చిన్నవయస్సులోనే మా అందరిలో నీవే మిన్న అనే స్థాయికి మా కన్నయ్య ఎదిగినాడు అని అంటే అదంతా శారదామాత సంపూర్ణ అనుగ్రహాన్ని ఈ పసిహృదయానికి ప్రసాదించిందనడంలో సందేహమే లేదు. జానిగారి కలంలోంచి జాలువారే అక్షరసుమాలన్నీ పరిమళభరితమే.
కవిని గూర్చి యక్కలూరి శ్రీరాములుగారు చాలా చక్కగా తెలిపారు ‘కవి ఒక చెట్టు. ఏ గాలి వీస్తే ఆ గాలికి కొట్టుకుపోడు. తను రాలినా అనుభవాల ఆకుల్ని మట్టిమనుషులకే ధారపోస్తాడు. మట్టిలో తానై మనుగడ సాగిస్తూ మట్టిలోంచే పూలగుత్తి అయి చేయి పైకెత్తుతాడు' అని. ఇదే కవి హృదయానికున్న విశిష్టత. ఇంతటి నిపుణత కలిగిన నవ కవి, యువకవి శ్రీ జాని బాషాగారు తన అభిలాషను ‘అఖిలాశ’గా అక్షర చిత్రీకరణ చేసి యాభై ఒక్క కవితల తొలి ముద్రిత సంపుటితో మనముందుకొస్తున్న శుభతరుణంలో వారిని అభినందిసూ మనుముందు మరెన్నెన్నో సంపుటాలను వెలువరించాలని ఆశీర్వదిస్తూ.

- రుద్రారం శ్రీనివాసురెడ్డి
కవి