• Akashavani Padyapushpakam
  • Ebook Hide Help
    ₹ 15 for 30 days
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆకాశవాణి పద్యపుష్పకం

    Akashavani Padyapushpakam

    Author:

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


పద్య పుష్పక పరిమళ ప్రాభవమ్ము
జనుల గుండెలన్‌ చైతన్య ఝరుల నింపి
అమల సందేశ మానంద మందజేసి
మహిని శాంతిమయమ్ముగా మలచుగాక! 1

పద్యమెప్పుడైన పాత బంగారమ్ము
విలువ తగ్గబోదు విశ్వమందు
పాతచింతకాయ పచ్చడి అన్నను
ఆరగింప అద్భుతౌషధమ్ము| 2

ప్రజల వాంఛ నేడు బాహ్య సౌందర్యమ్ము
పరుగులెత్తుచుండె ప్రజల మదులు,
పద్యమందు నుండు బయటిసోకేగాక
దాని భావ మందు లోని సోకు 3

పద్యమనిన ఏదొ పనికిరానిదటంచు
వదలుకొనకు జాతి పరమ విద్య
వదిలిపెట్టు చెత్త పద్యకాననమందు
పనికివచ్చు నిధులు పట్టుకొనుము 4

తెలుగు పద్యాల వలననే తెలుగునేల
భారతీయ సంస్కృతి ఇంక బ్రతికియుండె
మానవానుబంధమ్ముల మధురరసము
లింక ప్రసరించుచున్నవి ఈ ధరిత్రి 5

మంచి వారికి పద్యాలు మల్లెపూలు
కలుష జాతికి విష్ణుచక్రమ్ము లగును
నిరతమును పద్య దేవత నిలిచియుండి
ధర్మసంస్థాపనము చేయదగును సతము. 6

- రావి రంగారావు

Preview download free pdf of this Telugu book is available at Akashavani Padyapushpakam