• Ajeyudu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 172.8
    192
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అజేయుడు

    Ajeyudu

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఫ్రెంచి నవలా రచయిత, నాటకకర్త అయిన అలెగ్జాండర్ డ్యూమా రాసిన అద్భుత నవల... ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో. ఈ నవల కథ చరిత్ర, రాజకీయాలతో ముడిపడింది. ఇందులో చాలా సంఘటనలు వాస్తవాధారాలు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వం.... ఫ్రెంచి విప్లవం కారణంగా వచ్చిన మానవీయ విలువలు ఈ నవలలో స్పష్టంగా కనిపిస్తాయి. స్వతహాగా ఈ విలువల పట్ల ఎంతో విశ్వాసం ఉన్న డ్యూమా... నవలలో అంతర్లీనంగా అవి కన్పించేలా కథనాన్ని చక్కగా మలిచారు. అసూయాపరులైన స్నేహితుల కుట్రకు జైలుపాలైన వ్యక్తి విడుదల కాగానే మారుపేరుతో సొంత ఊరికి తిరిగి వచ్చి అమోఘమైన ప్రణాళికలతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వారిపై పగతీర్చుకుని జీవితంలో 'అజేయుడి'గా నిలబడడం ఇందులోని మూల కథాంశం.

1844-46 సీరియల్‌గా వచ్చిన ఈ నవలకు విశేష ప్రజాదరణ లభించింది. సీరియల్ తదుపరి భాగం కోసం జనం దుకాణాల దగ్గర బారులు తీరేవారు. నవలగా వెలువడిన కొద్ది నెలల్లోనే పది భాషల్లోకి అనువాదమైంది. 1846 లో వెలువడిన తొలి ఆంగ్ల ముద్రణ కూడా బహుళ పాఠకాదరణ పొందింది. దాంతో అలెగ్జాండర్ డ్యూమా పేరు ప్రపంచమంతటా మార్మోగింది.

శతాబ్దాలు గడిచినా.... నేటికీ ఈ నవల పట్ల పాఠకులలో ఆదరణ చెక్కు చెదరలేదు. సమాజంలో సంస్కృతుల మధ్య, విలువల మధ్య ఎంతో అంతరం వచ్చినా... నవలని అప్పట్లో ఎంతగా ఆస్వాదించారో, నేటి పాఠకులు అంతగా ఆస్వాదిస్తున్నారు. ఈ నవల ఆధారంగా ఐదు సినిమాలు వచ్చాయి. సంగీత, రేడియో రూపకాలకైతే లెక్కేలేదు.

65 ఏళ్ళ క్రితం సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించిన ఈ అద్భుత నవలను కొంత క్లుప్తీకరించి 'అజేయుడు'గా మీ ముందుంచుతున్నాం.

Preview download free pdf of this Telugu book is available at Ajeyudu