• Aharam Arogyam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆహారం - ఆరోగ్యం

    Aharam Arogyam

    Publisher: Victory Publishers

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బ్రతకాలంటే ఆహారం అవసరం. ప్రకృతిలో జీవం ఏ రోజు పుట్టిందో, ఆ రోజే ''ఆహారమూ'' అవసరమయింది. క్రిమికీటకాదుల నుంచీ, చెట్టు చేమల నుండి మనిషి దాకా ఆహారం లేకుండా బతకం అసాధ్యం. అయితే జీవికి ఈ ఆహారం ప్రకృతి నుండీ, పరిసరాల నుండి దొరుకుతుంది. ప్రకృతిలో అందుబాటులో ఉన్నదాన్ని ఆహారంగా మలచుకొనే శక్తి జీవులకుంది. జీవులనూ, నిర్జీవులనూ వేరుచేసే అనేకానేక భేదాలలో ''ఆహారం'' ముఖ్యమైనది.

ప్రకృతిలోని మూలకాల నుండి 'ప్రాణం' లేదా 'జీవం' తయారైంది. జీవి జీవన క్రమాలను (పెరుగుదల, శ్వాసక్రియ, పునరుత్పత్తి, జీర్ణక్రియ మొదలైనవాటిని) నిర్వహించుకోవడానికి అవసరమైన ఆహారమూ (శక్తి) ప్రకృతినుండే తయారవుతుంది. ఈ ఆహారాన్ని ప్రకృతితో సంబంధం పెట్టుకోవడం (Interact) ద్వారా జీవి సంపాదించుకొంటుంది.

ఆహారాన్ని ఉత్పత్తిచేయడం, నిలువవుంచడం, రుచికరంగా వండుకోవడం మానవుని ప్రత్యేకత. ఎంత ఆహారం అవసరం అని నిర్ణయించనికి మానవశరీరంలో స్వతస్సిద్ధంగానే కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ''ఆకలి, రుచి'' అనేవి వాటిలో ముఖ్యమయినవి.

ఆహారానికీ రుచేగాక, ఆకలి సంతృప్తిపరచే గుణమేగాక, ''పౌష్టికవిలువల''ని కలిగివుండటమనే భౌతిక లక్షణం కూడా వుందని గుర్తుంచుకోవడం అవసరం. పౌష్టికాహారం ఆరోగ్య పరిరక్షణలో విడదీయరాని అంశం. రోగనిరోధకశక్తిని పెంచుకోవడనికి పౌష్టికాహారాన్ని మించింది లేదు.

నేడున్న పరిమితుల్లో రోజూ తినే తిండిలో మార్పులూ, చేర్పులూ చేసుకోవడం ద్వారా మనకందుబాటులోని ఆహారాన్ని మరింత 'పౌష్టికం'గా ఎలా మలచుకోవాలన్నది వివరించడానికే ఈ ప్రయత్నం.

ఆహారం అలవాట్లను శ్రద్ధగా తీసుకోక పోవుట చేత ఊబకాయం, రకరకాలరోగాల బారినపడి ప్రజలు తమ ఆదాయంలో 30% పైగా ఆసుపత్రులకే ఖర్చు చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. విలువైన జీవన ప్రమాణాలు పెరుగుతాయనుటలో సందేహం లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి - ఆచరించండి - ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించండి.

Preview download free pdf of this Telugu book is available at Aharam Arogyam