• Ahaniki Ramgumdadu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అహానికి రంగుండదు

    Ahaniki Ramgumdadu

    Pages: 118
    Language: Telugu
    Rating
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి పంపిన నవల "అహానికి రంగుండదు".

* * *

KinigeNovelCompetitionLogo ప్రకృతిలో ఎన్నెన్నో రంగులున్నాయి.
మనుషుల్లోనూ అనేక వర్ణాల వారున్నారు. ప్రపంచ దేశాలన్నింటికీ జాతీయ పతాకాలున్నాయి. వాటికి రంగులున్నాయి. మతాలకు రంగులున్నాయి. ఆదర్శాలకు, భావాలను, సిద్ధాంతాలకు, కంటికి కనిపించని వాటికి రంగులున్నాయి. వాటిని సింబాలిక్‌గా చూపిస్తున్నారు.

అలాంటప్పుడు ‘అహానికి రంగుండదు’ అనటం సరయిందా? ప్రేమ-ఆకలి, ఆధ్యాత్మికం- విప్లవం, మోక్షం ఇలా పరస్పర విరుద్ధంగా వున్న విషయాలకి రంగులు పులమటం వెనుక భౌతికమైన మెదడు నుండి పుట్టే ఆలోచనలు కారణం కావచ్చు.

మిగతా అంశాల్లో ఆయా సందర్భాల్లో వ్యక్తులు భిన్నంగా ప్రవర్తించవచ్చు. ‘అహం’ విషయంలో మాత్రం అలాకాదు. ఏ రంగులకు చెందిన వారయినా ‘అహానికి’ అతీతులుకారు. ఏ సిద్ధాంతమైనా తమలో చీలికలకి కారణంగా ఏమైనా చెప్పవచ్చు. నమోదు కానివి వ్యక్తిగత అహాలు. మనుషులూ- సంస్థలూ- దేశాలు- రంగులకి ప్రతీకలయిన చోట ‘అహానికి రంగుండదు’ అనడం అందుకే.

* * *

ఎప్పుడూ అలానే ఉంటుందా? మనుషులు వెనక్కి తిరిగి చూసుకోరా? మనుషుల అంతరంగాలు ఆవిష్కరించబడవా? రహస్యాలు అలా అవర్ణంగా ఆవిరవుతాయా?

శరీరావయవాల మీద మనసు, మనసు మీద బుద్ధి, బుద్ధిమీద ‘అహం’ ‘ఆర్థికం’ అధికారం చెలాయించటం, వాటిని ఆత్మ శాసించటం వెనుకవున్న కోణాన్ని విశ్లేషించే ప్రయత్నం మనలోకి మనం తొంగి చూసుకునే క్రమంగా చదివి, అనుభూతి చెంది, విశ్లేషించమని మనవి.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Ahaniki Ramgumdadu