-
-
ఆహా! ఏమి రుచి...
Aha Emi Ruchi
Author: Aluri Krishna Prasad
Publisher: J.V.Publishers
Pages: 139Language: Telugu
వంట ఆడవారే చెయ్యాలనే నిబంధనలకు కాలం చెల్లింది. ముఖ్య కారణం. ఈ రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగాలలో పగలనక, రాత్రనక అహర్నిశలూ కష్టపడుతున్నారు. అందువలన స్త్రీలకు వంట చేయడానికి పిల్లల ఆలన పాలన చూడటానికి తగిన సమయం ఉండటం లేదు. అన్ని ఊళ్ళల్లో మరియు విదేశాలలో కర్రీ పాయింట్లు ఉండక పోవచ్చు. అధవా ఉన్నా అదే పనిగా కర్రీ పాయింట్లలో వండిన పదార్థాలు తింటే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది.
దీనికి ఏకైక పరిష్కారం. మగవారికి కూడా చిన్నతనం నుండి వంట చేయడం వచ్చి ఉండాలి. అవసరమైన సమయంలో భార్యా భర్తలు ఇద్దరు వంట చేసే విషయంలో సహకరించుకుంటూ ఉండాలి. ఇందులో పురుషులు నామోషీ పడవలసిన పనిలేదు. భార్య చేసిన వంట భర్త మెచ్చుకుంటే ఆ ఇల్లాలు ఎంత ఆనంద పడుతుందో భర్త స్వయంగా చేసిన వంట భార్య మెచ్చుకున్నప్పుడు ఆ భర్తకు కూడా అంతే సంతోషం కలుగుతుంది. ఎటొచ్చీ ఆ సంతోషం అనుభవించిన వారికే అనుభవైకవేద్యం.
- ఆలూరి కృష్ణప్రసాదు
