• Advaitamruta Varshini - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అద్వైతామృత వర్షిణి (free)

    Advaitamruta Varshini - free

    Pages: 287
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచాన్ని వదలాలని ఉన్నా, వదలలేక, ప్రపంచాన్ని వదలినట్లున్నా అందవలసినది అందక, అందుకున్నా అందిందో లేదో అన్న శంక యాతన పెడుతున్నప్పుడు గురువే గురుతు చూపిస్తాడు. ప్రత్యక్ష పరోక్ష అనుగ్రహం కురిపిస్తూ, పరీక్షిస్తూ, పరిరక్షిస్తూ, నిరీక్షణ క్షణాలను యోగక్షణాలుగా మారుస్తూ దారిచూపిస్తాడు. తథ్యం! మానవ జీవితమే మహాయోగం.

మానవశక్తులను కాదనుకుని దివ్యశక్తులను పొందాలనుకునే ప్రయత్నం యోగం కాదు. మానవశక్తుల పరిధిని, పరిమితిని గుర్తించి, వాటిని మరింత స్పష్టంగా, బలంగా అనుభవించటమే నిజమైన యోగ జీవితం. శాస్త్రాలు, వ్యాఖ్యానాలు, వివరణలు, వాదాలు యోగ భూమికను స్పష్టంగా బోధిస్తాయి. అవగాహనవల్ల మార్గం సుగమమౌతుంది. అంతరంగ ప్రయాణం తేలికవుతుంది.

మానవ జీవితమే ఒక దివ్యగానం. ఒక సుజ్ఞానగీతిక. నిరంతర పరిణామం జీవలక్షణం. సత్యాన్వేషణ దాని పరమావధి. ఆత్మ సత్యము కనుక, సత్యాన్వేషణ అంటే ఆత్మాన్వేషణే. పరమనిష్ఠతో కొనసాగించే అన్వేషణ ఎంతో సులభం. మార్గం ఆంతరంగికం. గమ్యమూ ఆంతరంగికమే. సిద్ధీ ఆంతరంగికమే. అంతా లోపలే వుంటే, బయట వున్నదేమిటి? కాదనుకోవలసినదంతా బయట అనిపిస్తున్నది. కావలసినది మాత్రం లోపల వున్నది. పరిణామం చెందుతూ ‘అపరిణామ ప్రాప్తి’ పొందితే అదే ముక్తి! అటువంటి జీవనముక్తే, యోగాంతం!

స్వప్నానుభవాలు, స్వాత్మానుభూతులు, తత్వానుసంధానం, అనుక్షణం లభించే అపురూప వరాలు, పైకి కనిపించినంత తేలికైన విషయాలు కావివి. ఎన్నో స్థితులు, ఎన్నో గతులు, మరెన్నో సంగతులు.

జీవుడి వేదన, నివేదన, ఆరాధన, అర్పణ, అన్వేషణ, నిరీక్షణ, నిర్వేదన, అలజడి, ఆనందం, ఊహ, ఉద్వేగం, ఉత్సాహం, అరుణ-అచలస్థితులు, శరణాగతి, సేవ, ప్రేమ వంటి పదహారు కళల సమాహార స్వరూపంగా ఈ గ్రంథం "అంతర్వాహిని".

- వి.ఎస్.ఆర్. మూర్తి