• Adugu Jadalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 71.4
    84
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అడుగు జాడలు

    Adugu Jadalu

    Pages: 113
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితాలని రంగురంగుల అద్దాలలోంచి కాకుండా మామూలు బతుకుల్లోంచి చూపెట్టడమే భమిడిపాటి జగన్నాథరావుగారి కథలు చేసే పని. అందరూ పట్టించుకోకుండా పోతున్న ''బతికిన క్షణాలని'' ఒడిసి పట్టుకుని, వాటి అవసరాన్ని, అనివార్యతను నిశ్శబ్దంగా చెపుతున్న కథలు ఇవి. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం రాసిన కథలు. ఇప్పటికీ, ఎప్పటికీ మనసును పట్టి, మనకు చూపెట్టే కథలు. జీవితమంటే డబ్బు సంపాదనే అని, ఒక డాక్టర్‌ కూతురు, ఒక ఇంజనీర్‌ కొడుకని, నాలుగదయిదు అంతస్తుల ఏసి భవంతులని, బ్రాండెడ్ కంపెనీ కార్లని, నోట్లకి నోట్ల నగదని, లెక్కకు అందని డిపాజిట్లని భ్రమపడి పరుగుపెడుతూ, అలసి పడుతూ, ఆ ఉష్ణాయాసపు తీవ్రతలోంచి చూపుకూడ సరిగ్గా కనపడక చీకట్లోకి జారిపోతున్న ఈనాటి బతుకులు వినవలసిన కథలు.

జీవితంపట్ల ఇష్టం, జీవితాన్ని అందంగా చూడడం, జీవితంలో ప్రతిక్షణాన్ని పదిలపరుచుకోవడం, అలా చేసుకోవడనికి కావలసిన స్వేచ్ఛను, స్వచ్ఛతను సాధించడం జగన్నాథరావుగారి కథల గొప్పదనం. చాలా మామూలుగా, చిన్న చిన్న కబుర్లను వింటున్నట్లుగా, ఒక ఫంక్షన్లో కలిసిన దూరపు చుట్టపు స్వగతాన్ని పంచుకుంటున్నట్లుగా, ఎప్పుడో తెగిన స్నేహం అనుకోకుండా అతుక్కొని జ్ఞాపకాల పందిరి అల్లుతున్నట్లుగా ఈ కథలు మనకి తెలీకుండానే మనలో జీవితం పట్ల సెన్సిటివ్‌నెస్‌ని ఇంజక్టు చేస్తాయి.

- నండూరి రాజగోపాల్‌

Preview download free pdf of this Telugu book is available at Adugu Jadalu