• Adhyatmika Guru Parampara
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 112.50
    125
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆధ్యాత్మిక గురు పరంపర

    Adhyatmika Guru Parampara

    Pages: 218
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేదభూమియైన మన భరతభూమిలో వేదకాలం నుంచి నేటివరకు సద్గురువులకు కొదువలేదు. వేదసారాన్ని మనకందించిన మహర్షులే మనకు తొలి గురువులు. భగవద్గీత రూపంలో వేదాల, ఉపనిషత్తుల సారాన్ని, జీవిత పరమార్థాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి ఉపదేశించిన తొలి గురువు - శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుచేతనే మనం “కృష్ణం వందే జగద్గురుం" అంటున్నాం. కాని ద్వాపర యుగానికి ముందు యుగాలలో కూడా వశిష్ట, విశ్వామిత్ర, భరద్వాజ, కపిల, గౌతమ, పరాశర, అగస్త్యాది మహర్షులు అటు పాలించే రాజులకు, ఇటు పాలింపబడే ప్రజలకు ధర్మబోధ చేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించారు.

యుగాలు మారినా ఈ గురు పరంపర కొనసాగుతూనే ఉంది. మన భరత భూమిలో జన్మించిన ఆధ్యాత్మిక గురువులు కలియుగంలో కూడా తమ కర్తవ్య పాలన చేస్తూ ఉన్నారు. మనదేశంలోనే కాక విదేశాలలో సైతం తమ బోధలను ప్రజలకు అందజేసి, వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలిస్తున్నారు. మత విద్వేషాలను తగ్గించి, ఉగ్రవాదాన్ని ఖండించి, విశ్వశాంతి కొరకు తమవంతు కృషిని చేస్తున్నారు. ఇది చాలా అభినందించాల్సిన విషయం.

కాని ఈ కలియుగంలో, యుగ ధర్మాన్ని బట్టి నకిలీ బాబాలు, దొంగ స్వామీజీలు ఎక్కువయ్యారు. ప్రజలను తమ మాయ మాటలతో ఆకర్షించడం, ముక్తి, మోక్షం లాంటి మాటలను పదేపదే వాడుతూ, ఆత్మ సాక్షాత్కారం అనే దానిని బజారులో కొనదగిన వస్తువుగా నమ్మించడం, వారిని ప్రలోభాలకు గురిచేసి, వారినుంచి పెద్ద ఎత్తున ధనాన్ని రాబట్టడం వంటి ఆధార్మిక, అనైతిక విధానాలు ఎక్కువయ్యాయి. ఇటువంటి అధ్యాత్మిక వ్యాపారుల వల్ల మన సనాతన ధర్మానికి చాలా చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికే వచ్చింది. అందువల్ల, “పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్నట్లు “గురువులందు సద్గురువులు వేరయా” అని అనవలసి వస్తుంది.

మన సనాతన ధర్మం, దానిలో పొందుపరచబడిన అంశాలు ఎన్నో ఉన్నతమైన ఆదర్శాలు, ఉత్తమ విలువలతో కూడుకున్నవి. వీటిని సరియైన రీతిలో అందించే సద్గురువులను మనం ఆశ్రయించాలి. అంతేగాని వాటిని వక్రీకరించే వారి వద్దకు వెళ్ళకూడదు. మన ప్రాచీన శాస్త్రాలపైన, పురాణేతిహాసాలపైన వక్ర భాష్యం చెప్పేవారిపట్ల ఆసక్తి కనబరచరాదు. మనల్ని ప్రలోభ పెట్టాలని చూసే నకిలీ బాబాలు, స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇన్ని శతాబ్దాలుగా ఈ భారత జాతిని పరిరక్షిస్తున్న మహాత్ముల చరితలను మనం తెలుసుకోవాలి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను సరియైన పాళ్ళలో మనకు అందిస్తూ, మనలోని సత్త్వ, రజస్తమో గుణాలు అదుపు తప్పి ప్రవర్తించకుండా మన జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించే యోగి పుంగవులు, అచార్యులు అయిన సద్గురువుల గురించి తెలియజెప్పడమే ఈ గ్రంథ రచన ప్రధానోద్దేశ్యం.

- జె.వి.వి. సత్యనారాయణ మూర్తి

గమనిక: " ఆధ్యాత్మిక గురు పరంపర " ఈబుక్ సైజు 5.7mb

Preview download free pdf of this Telugu book is available at Adhyatmika Guru Parampara