-
-
ఆపస్తంబ గృహ్య సూత్రము
Aapastamba Gruhya Sutramu
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 235Language: Telugu
ఆపస్తంబ గృహ్య సూత్రము
ఈ పుస్తకం గురించి
ఆపస్తంబ గృహ్య సూత్రమంటే....
ఈ దేశంలో మానవునికి సంబంధించిన ఏ కర్మయైనా మంత్రపూతంగా చేయబడుతుంది. మంత్రాలవల్ల శరీరానికి మనస్సుకు సంస్కారమేర్పడుతుంది. అందువల్లనే తల్లి కడుపులో ప్రవేశించిననాటి నుండి మానవుడు చనిపోయేవరకు చేసే పదునారు కర్మలను షోడశ సంస్కారాలంటూ మనవారు పిలిచినారు. కాలక్రమంగా అవి వేడుకలుగా మారినాయి.
మన పూర్వ ఋషులు సంస్కారాన్ని (అది సీమంతమైనా, నామకరణమైనా, పుట్టువెంట్రుకలైనా గురువు దగ్గరకి పంపే ఉపనయనమైనా, వివాహమైనా) ఏ విధంగా చేయాలి ఏ ఏ వేదమంత్రాలను ఉచ్చరిస్తూ చేయాలి అనే విధానాన్ని సంక్షేపంగా (సూత్రాల రూపేణా) తెలియజేసినారు. వేదాల పట్ల, ఋషుల పట్ల గౌరవభావంతో నేటికినీ కొన్నిటిని మనం అనుసరిస్తున్నాం.
ఈ విధంగా గృహస్థ ధర్మాన్ని ఆచరించేవారు తప్పక ఆచరించవలసిన షోడశ సంస్కారాలలో అంత్యసంస్కారం వంటి కొన్ని సంస్కారాలను వదిలివేసినా ఆపస్తంబ మహర్షి వాస్తు ప్రకరణం, గ్రహశాంతి, కొత్తలు పెట్టుకొనుట (ఆగ్రయణం) కొన్ని విధములైన కోరికలు తీర్చుకొనుటకు చేయవలసిన పనులు మొదలైన వానిని కూడా తన సూత్రగ్రంథంలో చేర్చి లోకులకు పరమోపకారం చేసినాడు.
తెలుగునాట ఉన్న ద్విజులు చాలా మంది (అంటే బ్రాహ్మణులు మాత్రమే కాదు) ఆపస్తంబ సూత్రులు. వారు ఆపస్తంబ మహర్షి చెప్పినట్లు నడుచుకుంటున్నామని ప్రతి దినం సంధ్యావందనం చేస్తూ చెప్పుకుంటారు. కాని ఆపస్తంబుడెవరు? అతడు చెప్పిన గృహ్యసూత్రాలలోని విషయమేమి అనునది తెలిసినవారు చాలా తక్కువ.
మానవునకు సహజంగా ఉండే సోమరితనం వల్లనైతేనేమి, మిక్కిలి బలమైన కాలం ప్రభావం వలనైతేనేమి మూడవ ఏట చేయాల్సిన పుట్టువెంట్రుకలను (చౌలమును) ఉపనయనంలో చేసికొంటున్నాము. విద్య పూర్తియైన వెంటనే చేసుకొనవలసిన స్నాతకాన్ని (సమావర్తన సంస్కారం నేటి కాలంలో విశ్వవిద్యాలయాల్లో 'కాన్వోకేషన్' పేర జరుగుతున్నది) వివాహానికి ముందు చేసికొంటున్నాము. అత్తగారింట్లో చేయవలసిన అరుంధతీ నక్షత్ర దర్శనం మొదలైన వాటిని పెండ్లిపందిరిలో పట్టపగలే చేస్తున్నాం. నామకరణం (చిన్నారికి పేరు పెట్టడం)లో ఉన్న నియామాలను ఇంచుమించుగా మరచిపోయాం. ఐనా ఆ మహర్షి చెప్పిన చాలా నియమాలను నేటికీ అనుసరిస్తున్నాం. అదే భారతీయుల ప్రత్యేకత.
కాలప్రవాహంలో కొట్టుకొని పోతున్న మనం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆపస్తంబ మహర్షి మనకు ప్రసాదింపగా మహర్షిపై గల గౌరవంతో నేటికీ ఆచరిస్తున్న నియమాలను చక్కగా తెలిసికొనుటకు చేసిన చిన్న ప్రయత్నమిది.
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
Sir, we looking for this book to buy. Please provide phone no and address for availability. My no 9290825840