• Aanati Gunturu Zilla 1788 1848
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనాటి గుంటూరు జిల్లా (1788-1848)

    Aanati Gunturu Zilla 1788 1848

    Pages: 302
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 premium votes.
Description

శ్రీ ఇన్నయ్య గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏసియన్ స్టడీస్‌లో పనిచేస్తున్నప్పుడు, రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ (Robert Eric Frykenberg) రాసిన Guntur District (1788-1848): A History of Local Influence on Central Authority in South India (Oxford: Clarendon Press 1965) చదివారు. 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇన్నయ్యగారు ఫ్రికెన్‌బర్గ్‌ను కలుసుకున్నారు. ఊటీలో పుట్టిన ఫ్రికెన్‌బర్గ్ చాలా చిన్నతనంలో స్వీడిష్ మిషనరీ అయిన తండ్రితో గుంటూరు వచ్చాడు. పన్నెండేళ్ల వరకు తండ్రితో గుంటూరు, నల్గొండ జిల్లాల గ్రామాల్లో సంచరించాడు. తెలుగు బాగా మాట్లాడగలిగేవాడు. కాలక్రమేణా ఇంగ్లండ్‌లో పిహెచ్‌డీ చేసి, విస్కాన్సిన్ (మాడిసన్) విశ్వవిద్యాలయంలో చేరి, ప్రస్తుతం చరిత్ర, దక్షిణ ఆసియా విభాగాల్లో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా ఉంటున్నారు. ఆయన అనుమతితో శ్రీ ఇన్నయ్య ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.

ఈ పుస్తకం వల్ల చరిత్రలో ఒక కీలక ఘట్టం గురించిన ఆసక్తికరమైన అనేక విషయాలు తెలుస్తాయి. పేరుకు ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన పుస్తకమే అయినా దీనిలో విషయాలు మద్రాసు ప్రెసిడెన్సీలో అనేక ప్రాంతాలకు అన్వయిస్తాయి.

ఫ్రికెన్‌బర్గ్ ఈ చరిత్రను శాస్త్రీయ పద్ధతిలో శ్రద్ధగా పరిశీలించి, ప్రతి విషయానికి ఆధారాల జాబితా ఇస్తూ, సాధికారికంగా పుస్తకం రాశారు. ఎప్పుడో మరుగునపడిన ఈ పుస్తకాన్ని ఇన్నయ్యగారు ఇప్పుడు ఈ అనువాదం రూపంలో ప్రాచుర్యం కలిగించడం ముదావహం. పుస్తకం చివర ఇచ్చిన ఆధారపత్రాల సూచిక ఈ విషయాలపై ఆసక్తి ఉన్నవారికి కొత్త దారులని చూపిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Aanati Gunturu Zilla 1788 1848