• Aame Atadini Marchukundi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆమె అతడిని మార్చుకుంది

    Aame Atadini Marchukundi

    Pages: 178
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అద్వైత స్నానం చేసి రెడీ అయి భద్రకాళి గుడికి వెళ్లింది.

... ఆమెకెందుకో రాత్రి నుండి వరంగల్‌లో తిరగాలన్నా, వుండాలన్నా భయంగా వుంది... షాజాద్‌ ఏ క్షణంలోనైనా తనని చంపేస్తాడని ఆమెకి తెలుసు. అది గుర్తొస్తేనే గుండెలు అవిసిపోతున్నాయి.

అమ్మవారికి అభిముఖంగా నిలబడి చేతులు జోడించి...

‘‘అమ్మా ! నా కంతా అయోమయంగా వుంది. నా జీవితానికి ఆది ఏంటో, అంతం ఏంటో తెలియటం లేదు. అంతా ఏకమై కన్పిస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి ?

నిన్ను ఏం కోరుకోవాలన్నా భయంగా వుంది.

శక్తిని కోరుకోవాలన్నా భయంగా వుంది.

శక్తిని ఇమ్మని వేడుకుంటే కష్టాలు కలిగించి ఎదుర్కోమంటావేమో ! తెలివిని ఇమ్మని అడిగితే సమస్యల్ని సృష్టించి సరిదిద్దుకోమంటావేమో ! ధైర్యాన్ని ప్రసాదించమంటే ఆపదలు కలిగించి అదిగమించమంటావేమో !

అన్ని రహస్యాలు తెలిసిన నీతో ఓ రహస్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి ఆ రహస్యాన్ని నాతో నేను చెప్పుకోవాలంటేనే నా మనసు అంగీకరించటం లేదు... నాక్కూడా చెప్పుకోలేని ఆ రహస్యం నా జీవితంలో వుండటాన్ని నేను ఎలా భరించాలి ? ఎలా జయించాలి ?

షాజాద్‌ అనే ఉగ్రవాది పాకిస్థాన్‌ నుండి ఈ దేశాన్ని కబళించాలని వచ్చాడు... ప్రస్తుతం నన్ను కూడా చంపాలనుకుంటున్నాడు. ఇది అన్యాయం కదా !

ఆ షాజాద్‌ ఎవరో కాదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన కార్తీక్‌ ! అది నిన్ననే తెలిసింది. కార్తీక్‌నిఒక ఉగ్రవాదిగా ఊహించుకోలేకపోతున్నాను. అతన్ని మార్చు... లేదంటే అతన్ని శిక్షించు..."

Preview download free pdf of this Telugu book is available at Aame Atadini Marchukundi