• Aakaasam
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 75.6
  84
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఆకాశం

  Aakaasam

  Author:

  Publisher: Palapitta Books

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మీరు కవిత్వ ప్రేమికులై, మనశ్శాంతిని కలిగించగల కవిత్వం కావాలనుకొంటే ఆకాశం చదవండి.

'ఆకాశం' కవిత్వం అతి సున్నితమైన జీవన స్పర్శ నుండీ, ప్రగాఢమైన తాత్విక చింతన నుండీ వ్యక్తమైంది. దీనిని నేను పాఠకుడికి కేవలం కావ్యానందం ఇవ్వటం కోసం కాని, ఈ కాలం సాహిత్య వాతావరణంలో బాగా ప్రచారంలో ఉన్న సామాజిక, రాజకీయ స్పృహతో కానీ రాయలేదు. వాటికి పైనున్న ఒక ఉదాత్త లక్ష్యంతో రాసాను.

ఇటువంటి కవిత్వం రాయటానికి కవికి జీవితంపట్ల ఎటువంటి గౌరవమూ, శ్రద్ధా కావాలో, తనలోకి తాను నిష్కపటంగా పరిశీలించుకోగల శుభ్రమైన దృష్టి కావాలో, పాఠకునికీ అటువంటి శ్రద్ధా, దృష్టీ కావాలి. అటువంటివారు ఏ దేశకాలాలకీ, జీవన విధానాలకీ చెందినవారైనా, మాయపొరల వెనకాల ఉన్న తమ స్వచ్ఛమైన ప్రతిబింబాన్ని ఈ కవిత్వంలో దర్శించి ఆశ్చర్యపడతారు.

ఇటువంటి కవిత్వాన్ని మార్మిక కవిత్వంగా పిలవటం సాహిత్య ప్రపంచంలో వాడుక. అంటే జీవన మౌలిక సత్యాలను వెదికేది, అనుభవం లోకి తెచ్చే ప్రయత్నం చేసేది అని. టాగోర్, సూఫీ కవులు, కన్నడ శివకవులు, కొన్ని సందర్భాలలో మన అన్నమయ్య, వేమన, పోతనలు, ఖలీల్ జిబ్రాన్ ఈ తరహా కవిత్వం రాసిన వారిలో కొందరు. జపాన్‌కు చెందిన హైకూ కూడా ఇటువంటి కవిత్వమే.

ధ్యానమంటే సమగ్రమైన, సంపూర్ణమైన స్పందన అని అనుకొంటే, దీనిని ధ్యానకవిత్వంగా కూడా భావించవచ్చు.

కవినో, కవిత్వాన్నో తెలుసుకోవటం కోసమో, కాలక్షేపం కోసమో కాకుండా, మీ హృదయం నిజంగా జీవితానుభవాల వల్ల బరువెక్కి ఉంటే, మీ మనసే మీకు అర్థంలేని గీతలతో, మరకలతో నిండిన కాగితంలా కనిపిస్తూ, అసహనానికి గురి చేస్తుంటే, జీవితం ఏమిటి, ఎందుకు వంటి ప్రశ్నలు లోలోపల ఎక్కడో ముల్లులా గుచ్చుతూ ఉంటే, ఈ కవిత్వం తప్పక చదవమని చెబుతాను.

ఇది తప్పక మీలో ఒక ప్రశాంతమైన వెలుతురునీ, నెమ్మదినీ, నిజమైన వివేకంతో నిండిన ఆలోచనా శక్తినీ, అతి సహజమైన జీవనానందాన్నీ మేలుకొలుపుతుందని నమ్ముతున్నాను.

- బివివి ప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Aakaasam
Comment(s) ...

మానస చామర్తి: బివివి ప్రసాద్ 'ఆకాశం అందిన క్షణాలు '

http://www.madhumanasam.in/2012/09/blog-post_11.html

నా సాహిత్యనేపధ్యం, అభిప్రాయాలు ఇక్కడ చదవవచ్చు.
http://bvvprasad.blogspot.in/2012/08/blog-post_6.html

ఆకాశం పుస్తకం గురించి ప్రముఖుల అభిప్రాయాలు

'ఆకాశం' గురించి ప్రసిద్ధ కవులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, శ్రీ కె.శివారెడ్డి, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ ల ప్రసంగాలు:

గొప్ప కవిత్వం మనను మౌనంలోకి తీసుకెళ్తుందంటారు. ఆఖరు పేజీ పూర్తి చేసీ చేయగానే అనిర్వచనీయమైన ఆనందపు కెరటాలేవో బలంగా తాకి మనసును కుదిపేస్తాయంటారు. ఆ మాటలన్నీ అబద్దాలు కావని నిరూపించగల కవులు మనకు అరుదుగా తారసపడతారు. బి.వి.వి అటువంటి అతి తక్కువ మందిలో ఒకరు.

తాత్వితకనూ, బ్రతుకులోని మానవీయ కోణాన్నీ సరళమైన మాటల్లో కూర్చి, అంతరంగాన ఎక్కడో మనకే తెలియకుండా అస్పష్టంగా దాగి ఉండే అహాన్ని అక్షరాలతో కరిగించే సమున్నతమైన కవిత్వం ఈ "ఆకాశం".