• Aadukundam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    66
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆడుకుందాం

    Aadukundam

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం " 'చదువు'ల సారం" అనే శీర్షికతో వెలువడిన పుస్తకాల సిరీస్‌లోనిది. ఇది డిపిఇపి ద్వారా ప్రచురితమైన 'చదువు విజ్ఞానం' పత్రిక నుండి సేకరించిన సంకలనం. పిల్లలు ఆడుకునేందుకు అనేక ఆటలను ఈ పుస్తకంలో చెప్పారు. వీటిని ప్రధానంగా నాలుగు వర్గాలుగా విభజించారు

* * *

1. సరదా ఆటలు
మనవాళ్ళు ఆట - పాట అంటారు. శ్రమలోంచి పాట పుడితే విశ్రమ వేళలకు ఆట పుట్టిందని చెప్పుకోవచ్చు. ఆట ఒక కాలక్షేపం, ఒక ఆనందానుభూతి. ఇక్కడ ఇచ్చిన ఆటలన్నీ సరదాగా, సంతోషంగా ఆడుకునే ఆటలు. పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని ఆడించే 'దేవుడమ్మా, దేవుడు,' ఆర్చి కిందకో, కర్ర కిందకో ఎవరు వస్తే వాళ్ళు కూర్చుండిపోయే 'బొట్టుకు రెండు ద్రాక్షపండ్లు', లేదా 'కోత కోత వంకాయ్‌ - కొమ్మద్దోంకాయ్‌' వంటివి ఇందుకు ఉదాహరణలు. ఆటల్లో కూడ పాటలు చాలా ముఖ్యం. పల్లెటూళ్ళల్లో ఆటలతో పాడుకునే పాటలను 'ఆటవిడుపు పాటలు', 'ఆటల్లో పాటలు' వంటివి తెలియచేస్తాయి.

2. ఎవరికి వారు
ఈ ఆటలు వ్యక్తిగత ప్రతిభ, నైపుణ్యాన్ని చూపించేవి. పల్లెల్లో సాధారణంగా ఆడుకునే తొక్కుడు బిళ్ళలాంటిదే 'రౌండ్‌ పెట్టెలలో తొక్కుడు బిళ్ళాట', చింత పిక్కల లాంటిదే 'గాజొప్పులాట'. ఇటువంటి ఆటలు, అలసట, సమయం తెలియకుండ పిల్లలు ఎంతసేపైనా ఆడతారు. సాంప్రదాయక బెచ్చాలాట, గురిచూసి కొట్టం వంటి ఆటలే కాకుండ నటన, ఇతర నైపుణ్యాలను పెంచే అనేక కొత్త ఆటలు కూడ ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో కొన్ని టీచర్లు, లేదా పెద్ద వాళ్ళు ఆడించేవి ఉంటే కొన్ని పిల్లలు తమంతట తాము ఆడుకునేవి ఉన్నాయి.

3. ఒకరిని ఆడించడం
దాగుడు మూతలు, దొంగ - పోలీసు, నేల-బండ వంటి ఆటలు తెలియని పల్లెటూరి పిల్లలు ఉండరు. ఈ ఆటల్లో ఎంత మందైనా ఉండవచ్చు, అందులో ఒకరిని మిగిలిన వాళ్ళందరూ ఆడిస్తారు, కవ్విస్తారు, ఆట పట్టిస్తారు. వీరి వీరి గుమ్మడి పండు కాస్తా కొంచెం సేపటికి దొంగ పోలీస్‌ అయిపోతుంది. ఎటువంటి ఆట వస్తువులు లేకుండా ఉన్న ప్రదేశాన్ని ఉపయోగించుకుని ఆడే ఆటలు ఇవి (ఉదాహరణకి 'నేల బండ' మాదిరిగా ఉన్న 'చెట్లాట'ని చూడండి). పగటి పూటే కూడా రాత్రిళ్ళు ఆడుకోటానికి అనువైన ఆటలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఆటలన్నీ కూడ ఎక్కువగా పిల్లలు తమంతట తాము ఆడుకునేవే. చిన్న పిల్లల్ని ఆటలో అరటిపండు చేసి ఆడిస్తే, ఆటలు ఆడి అలసి వచ్చిన పిల్లలకు అటుకులు, బెల్లం పెట్టం తల్లుల వంతు.

4. బృంద ఆటలు
ఇప్పటివరకు ఆడుకున్న ఆటల్లో గెలుపు ఓటములకు అంత ప్రాముఖ్యత లేదు. నియమాలు కూడ పిల్లలు ఏర్పరుచుకునేవే, ఆటలు వాళ్ళు ఆడించుకునేవే. ఆటల్లో గొడవలు వచ్చినా వెంటనే మరిచిపోతారు, పెద్ద పిల్లలుసర్దిచెపుతారు. ఈ ప్రక్రియలు బృంద ఆటల్లో కొంత సంక్లిష్ట రూపం తీసుకుంటాయి. ముక్కుగిల్లే ఆట జట్టుగా కూడ ఆడడం ఇందుకు ఉదాహరణ. పోటీ, గెలుపు ఓటముల ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంకోవైపు పిల్లలుబృందంగా వ్యవహరించడం కొంత నేర్చుకుంటారు. గెలవాలనే ఉద్దేశంతోటే ఆటలోకి దిగినా ఆడటంలోనే అసలైన ఆనందం ఉందని గుర్తించటం జీవితపు ఆటలో ఎంతో కీలకం.

Preview download free pdf of this Telugu book is available at Aadukundam