• 25th Frame Subham Taruvata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 25th ఫ్రేమ్ శుభం తరువాత

    25th Frame Subham Taruvata

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 220
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వంశీకృష్ణ తను విశ్లేషించే ప్రతి చిత్రాన్ని క్షుణ్ణంగా ఆపోశనపట్టాడు. కొన్ని చిత్రాలను హిందీ, ఇంగ్లీషు చిత్రాలతో పోల్చి ఆయా చిత్రాల సామ్యాన్ని, విభేదాల్నీ వివరించాడు. తెలుగులో వచ్చిన ప్రతీ చిత్రం జాతకాన్ని ఆకళించుకున్నాడు. ఈ విశ్లేషణాత్మక కృషికి ఎంతో పరిశ్రమ, అవగాహన కావాలి. నేను ఆశ్చర్యపోయేంత సునిశితంగా ఉన్నాయి ఈ వ్యాసాలు. ఒక మంచి కవిత రాయగల మంచి రచయిత పలుకు, విశ్లేషణా చాతుర్యం, చక్కని ఎక్స్‌ప్రెషన్ ఈ వ్యాసాల్లో ద్యోతకం కావడం విశేషం. ఈ పుస్తకం నా చేత వదలక చదివించింది. ఎవరినయినా చదివించగలదు. ఇందులో నిజాయితీ పరుడయిన విశ్లేషకుడి అంతర్మథనం, అపూర్వమైన రచనా శిల్పం ఉన్నాయి.

- గొల్లపూడి మారుతీరావు

వంశీకృష్ణ వ్యాసాలు చదువుతుంటే సినిమా నడిచొచ్చిన దారి గురించిన వివరాలు తెలుస్తాయి. సినిమా ఏఏ మైలురాళ్లను దాటొచ్చిందో తెలుస్తుంది. ఆ దారిలో ఎన్ని రంగులు మార్చిందో తెలుస్తుంది. సినిమా పరిణామక్రమం అంటే 35 ఎంఎం నుంచి స్కోప్ త్రీడీలు మాత్రమే కాదని... దాని సారం కూడా అనేక పరిణామాలకు గురైందనీ తెలుస్తుంది. సినిమాను చూడడం అంటే సమకాలీన సమాజాన్ని చూడడమేననీ సినిమా అంటే వ్యాపారం కనుక ప్రేక్షకులు ఏది డిమాండ్ చేస్తే అది చూపించడమే కాదని తెలుస్తుంది. ప్రేక్షకులు కోరుకోని దాన్ని చూపించి కూడా వాళ్లను మెప్పించిన సందర్బాల గురించి తెలుస్తుంది. మొత్తంగా సినిమాను ఎలా చూడాలో తెలుస్తుంది. మేం ఇద్దరం సామూహికంగా కన్న కల సీరియస్ సినిమా విమర్శ. ఆ కల పుస్తకంగా మారడం బావుంది.

- ప్రసేన్

Preview download free pdf of this Telugu book is available at 25th Frame Subham Taruvata