" మాయాశిల్పం..మంత్రఖడ్గం " నవల మమ్మల్ని గంధర్వలోకానికి తీసుకువెళ్ళింది.
మణిమేఘన మాటలు ముద్దుముద్దుగా వున్నాయి.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నించిన మణిమేఘనను చూస్తుంటే శ్రీదేవి కళ్ళముందు కదలాడింది.
కథనం దృశ్య ప్రదానంగా మారి కళ్ళముందు దృశ్యాలను ఆవిష్కరించింది.
కాంతారావు గారిని మీరు కలుసుకున్న సందర్భం వివరిస్తుంటే మనస్సు అర్త్త్రమైంది .నాకు ఇష్టమైన జానపద కథానాయకుడు.
జానపద నవలలు కనుమరుగయ్యాయని అనుకుంటున్న సమయంలో కినిగెలో జానపద నవలలు రావడం బావుంది.
" మాయాశిల్పం...మంత్రఖడ్గం " నవల చదువుతుంటే నాకళ్ళ ముందు రాజులు రాజ్యాలు అడవులు జలపాతాలు గంధర్వలోకం కనిపించాయి.చదివినంతసేపు కొత్త ప్రపంచంలో విహరించాం.
విజయార్కె గారూ మీ నుంచి మరిన్ని జానపద నవలలు రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
" పైసావసూల్. అండర్ వరల్డ్, మేన్ రోబో , క్యూ , సెక్షన్ 494 , టార్
కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
" ది లీడర్ " పుస్తకం కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి అద్దం పట్టింది.
" ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఫార్మూలా....కొత్త విషయం... ప్రపంచగమనాన్ని మారుస్తుంది.
ఒక స్వాతంత్ర్య పోరాటం దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఒక వ్యక్తి సాధించిన విజయం వ్యవస్థకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఆలోచన అభివృద్ధికి, కృషి సాధనకు పట్టుదల గెలుపుకు దారిత